ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్టైలిష్ డైరెక్టర్!ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్టైలిష్ డైరెక్టర్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్టైలిష్ డైరెక్టర్!

‘సై రా నరసింహారెడ్డి’వంటి చారిత్రక చిత్రం తరువాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారా అని చర్చ జరిగింది. ఆ తరువాత సురేందర్ రెడ్డి – అల్లు అర్జున్ కలిసి మరోసారి పనిచేయబోతున్నారని వార్తలు వినిపించాయి.

అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం బిజీగా మారడంతో ఇప్పట్లో వెరీ కలయికలో సినిమా  జేష్టమనే వార్తలు వినిపించాయి. తాజాగా కొత్త పేరు వినిపిస్తోంది. ఇటీవలే సురేందర్ రెడ్డి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు లైన్ వినిపించారట. లైన్ రామ్ కి భీభత్సంగా నచ్చడంతో సురేందర్ రెడ్డి తో కలిసి వర్క్ చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం రామ్ ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నారు. కిశోరె తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. థియేటర్స్ రే ఓపెన్ అయిన తరువాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.