సురేందర్ ముందున్నవి రెండే దారులు


సురేందర్ ముందున్నవి రెండే దారులు
సురేందర్ ముందున్నవి రెండే దారులు

సురేందర్ రెడ్డి టాలీవుడ్ లో చాలానే సూపర్ హిట్ సినిమాలు తీసాడు. తన తొలి సినిమా అతనొక్కడేతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సురేందర్ రెడ్డి కిక్, రేసుగుర్రం, ధ్రువ, సైరా నరసింహారెడ్డి వంటి హిట్ సినిమాలు చేసాడు. అయితే సురేందర్ టాప్ లీగ్ కు వెళ్లకపోవడానికి మధ్యలో వచ్చే ప్లాప్స్ కారణమని చెప్పొచ్చు. ఒక హిట్ సినిమా వచ్చిందంటే మరో ప్లాప్ సినిమా రావడంతో సురేందర్ రెడ్డి కెరీర్ టాప్ రేంజ్ కు చేరుకోలేదు.

అయితే రామ్ చరణ్ తో చేసిన ధ్రువ తన కెరీర్ కు భారీగా హెల్ప్ అయింది. ఆ సినిమాతో విజయం సాధించడమే కాదు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు సురేందర్. సైరా నరసింహారెడ్డి ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైనా కానీ మిగతా భాషల్లో అంతలా ఆడలేదు. తెలుగులో మాత్రం ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చిరంజీవి ఇమేజ్ ను, భారీ కాన్వాస్ ను అద్భుతంగా హ్యాండిల్ చేసాడని సురేందర్ కు కూడా పేరొచ్చింది.

అయితే సైరాతో అందరినీ ఇంప్రెస్ చేసినా కానీ సురేందర్ కు తన తర్వాతి చిత్రం విషయంలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటికీ ఇంకా తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు. మధ్యలో మహేష్, ప్రభాస్ అంటూ పలువురిని ట్రై చేసాడు కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. అయితే గత కొద్ది రోజులుగా సురేందర్ రెడ్డి తర్వాత సినిమా విషయంలో వార్తలు వస్తున్నాయి. వక్కంతం వంశీతో కలిసి రేసు గుర్రం సీక్వెల్ కు స్క్రిప్ట్ రాస్తున్నాడని వచ్చే ఏడాది బన్నీతో సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఇది కాకుండా అక్కినేని అఖిల్ తో నితిన్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా ముందు మొదలయ్యే అవకాశముందని సమాచారం.

చూస్తుంటే అఖిల్ సినిమా ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు రెండు సినిమాలను పూర్తి చేసాక కానీ మరో సినిమాకు అవకాశమివ్వలేడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.