పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీ మొదలయ్యేది అప్పుడే


పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీ మొదలయ్యేది అప్పుడే
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీ మొదలయ్యేది అప్పుడే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ను చేస్తోన్న పవన్ కళ్యాణ్, వరసగా సాగర్ చంద్ర, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, అది పూర్తయ్యాక మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కు డేట్స్ ను అలాట్ చేయనున్నాడు.

దాని తర్వాత క్రిష్ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేయనున్నాడు. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను ఒకేసారి పూర్తి చేసే ప్లాన్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సురేంధేర్య్ రెడ్డి ముందు అఖిల్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అది జరగాలంటే ముందు అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాన్ని పూర్తి చేయాలి. తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే సురేందర్ రెడ్డి – పవన్ కళ్యాణ్ మూవీ వచ్చే సమ్మర్ తర్వాత మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సైరా తర్వాత చాలా నెలలు బ్రేక్ వచ్చినా ఇప్పుడు సురేందర్ వరస సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నాడు.