మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి


మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి
మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి

దర్శకుడు సురేందర్ రెడ్డి 2019లో సైరా నరసింహారెడ్డి చిత్రంతో మంచి పేరే సంపాదించుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాన్ని, అత్యంత భారీ కాస్ట్ అండ్ క్రూను సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేసిన విధానానికి అందరూ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను బాహుబలి తరహాలో ఈ దర్శకుడు తెరకెక్కించిన వైనానికి చాలానే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మిగిలిన భాషల్లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా తెలుగులో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించి నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. సైరా చిత్రంతో సురేందర్ దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎక్కినట్లే. తాను కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించగలనని నిరూపించుకున్నట్లైంది.

ఇక సైరా తర్వాత సురేందర్ రెడ్డి తన తర్వాతి సినిమా ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ముందు మహేష్ బాబుతో ప్రయత్నించినా ప్రస్తుతం సూపర్ స్టార్ బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడు. దాని తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కానీ రాజమౌళితో కానీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, మహేష్ లిస్ట్ లో లేడు. తర్వాత ప్రభాస్ తో కూడా సురేందర్ ట్రై చేసాడు. కలిసి కథ కూడా వినిపించాడు. ప్రభాస్ కు కూడా ఇప్పుడు జాన్ తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. జాన్ ఈ ఆగస్ట్ కు పూర్తయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సురేందర్ తోనే ఉండే అవకాశాలు ఉన్నాయని మీడియా కథనాలు కూడా వెల్లడయ్యాయి.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సురేందర్ తో సినిమా చేస్తాను కానీ తనకు మరో ఏడాది సమయం కావాలని, 2021లో అయితే చేయగలనని అన్నట్లు తెలుస్తోంది. దీంతో సురేందర్ రెడ్డి తన రూట్ ను మార్చుకున్నాడు. టాప్ హీరోతో కాకుండా తన లక్ష్యాన్ని మార్చుకుని యంగ్ హీరోతో వెళుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి తన తర్వాతి చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్, బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కోసం సన్నద్ధమవుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అయ్యాక సురేందర్ రెడ్డితో సినిమా ఉంటుందని తెలుస్తోంది.