పాన్ ఇండియా హీరో…పాన్ ఇండియా డైరెక్టర్ కలవబోతున్నారు

పాన్ ఇండియా హీరో...పాన్ ఇండియా డైరెక్టర్ కలవబోతున్నారు.
పాన్ ఇండియా హీరో…పాన్ ఇండియా డైరెక్టర్ కలవబోతున్నారు.

అంతకుముందు వరకు హీరోకి తెలుగులో మార్కెటింగ్ అంతగా లేదు. సినిమాల సెలక్షన్ కూడా మంచిగా లేదు అని అన్నారు. ఒక్కసారిగా బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు మన ‘యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్’. తర్వాత ‘సాహో’ తో కూడా పాన్ ఇండియా రేంజ్ పొజిషన్ ని నిలబెట్టుకుందాం అనుకున్నాడు కానీ ఒక్క హిందీ లో మాత్రమే సినిమా గట్టెక్కింది.

తెలుగు, తమిళంలో సినిమా పరాజయం అయ్యింది. ఇక ‘సైరా నరసింహా రెడ్డి‘ సినిమాతో దర్శకుడు సురేందర్ రెడ్డి పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సినిమాకి చేతులు కలుపబోతున్నారు అనే మాట ప్రభాస్ అభిమానులకి తీపి కబురు లాగ అనిపిస్తుంది. ప్రభాస్ సాహు సినిమా చేస్తున్నప్పుడే తన 20 వ సినిమాకి ముహూర్తం మరియు పూజ కార్యక్రమాలు జరుపుకున్నారు.

‘జిల్’ సినిమా దర్శకులు రాధా కృష్ణ కుమార్ తో చేస్తున్న సినిమా పేరు ‘జాన్’ అని అనుకుంటున్నారు, ఇంకా అధికారక ప్రకటన ఏమి రాలేదు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకి అమిత్ త్రివేది సంగీత దర్శకులు. ప్రభాస్ కి ఆప్త మిత్రులైన యు.వి.క్రీయేషన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే సురేందర్ రెడ్డి తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది? యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉండబోతోందా? లేదా సురేందర్ సినిమా స్టైల్ లో డిఫరెంట్ గా ఉండబోతోందా? అనే ప్రశ్నలకి సమాధానం మాత్రం తొందరలోనే సురేందర్ రెడ్డి గారు కానీ, ప్రభాస్ గారు కానీ చెప్పకపోతే అభిమానులు ఊరుకునేలా లేరు?