రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చి సురేష్‌బాబు!


రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చి సురేష్‌బాబు!
రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చి సురేష్‌బాబు!

టాలీవుడ్ హంక్ రానా త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌నంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి షాకిచ్చాడు. త‌న ప్రేమ‌కు ఓకే చెప్పేసిందంటూ మిహీకా బ‌జాజ్ తో వున్న ఫొటోని షేర్ చేయ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా షాక‌యింది. ముంబైలో పుట్టిన మిహిక బ‌జాజ్‌ హైద‌రాబాలో పెరిగింది. ముంబై, లండ‌న్‌ల‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేసింది. ప్ర‌స్తుతం ముంబైలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంప‌నీనీ న‌డిపిస్తోంది.

గ‌త కొంత కాలంగా రానా, మి‌హీకా ప్రేమ‌లో వున్నా ఆ విష‌యాన్ని మీడియాకు తెలియ‌నీయ‌కుండా రానా జాగ్ర‌త్త ప‌డ్డారు. తాజాగా తానే ప్ర‌క‌టించ‌డంతో రానా ఫాద‌ర్ సురేష్ బాబు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఓ ఇంగ్లీష్ డైలీతో ముచ్చ‌టించిన ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. రానా నిర్ణ‌యంతో త‌న‌తో పాటు ఫ్యామిలీ అంద‌రికి ఆనందాన్ని క‌లిగించింద‌ని వెల్ల‌డించారు.

గ‌త కొంత కాలంగా రానా, మిహికా ఒక‌రి ఒక‌రు తెలుసుకున్నార‌ని, వీరి వివాహాన్ని డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌నుకుంటున్నామ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే ముందే వివాహం చేయాల‌నుకుంటున్నాం. ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆ విష‌యాన్ని ముందే తెలియ‌జేస్తాం. ప్ర‌స్తుతం ఫ్యామిలీ అంతా పెళ్లి ప్లానింగ్‌లో బిజీగా వుంది` అని రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.