అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌పై సురేష్‌బాబు సెటైర్స్‌!Suresh Babu Comments on Amazon on Netflix
Suresh Babu Comments on Amazon on Netflix

డిజిట‌ల్ టెక్నాల‌జీ, యూట్యాబ్ వాడ‌కం, ఆండ్రాయిడ్ ఫోన్‌లు విస్తృతం కావ‌డంతో ప్ర‌పంచం కు గ్రామంగా మారిపోయింది. ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఎవ‌రు కూడా స‌మ‌యాన్ని వృధా చేయ‌డానికి ఇష్ట‌పడ‌టం లేదు. కూర్చున్న చోటికే అన్నీ వ‌చ్చేయాల‌నే ధోర‌ణి ప్ర‌తీ ఒక్క‌రిలోనూ మొద‌లైంది. దాంతో ఎంత ఎగ్జైట్ చేసే సినిమా వ‌చ్చినా స‌రే స‌గ‌టు మ‌నిషి అర‌చేతిలో వున్న ఆండ్రాయిడ్‌నే న‌మ్ముకుంటున్నాడు. దీంతో పెరిగిన సాంకేతిక విప్లావానికి అనుగుణంగా భారీ కార్పొరేట్ కంపెనీలు మార్పులు చేర్పులు చేసుకుంటూ సామాన్యుడికి వినోదాన్ని అర‌చేతిలోనే అందించే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టాయి.

థియేట‌ర్‌కు వెళ్ల‌కుండానే వినోదాన్ని ఫోన్‌ల ద్వారా అందించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే ఈ రేసులో ఆమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్, మ‌న ఇండియాకు చెందిన జీ5 ముందు వ‌రుస‌లో వున్నాయి. త్వ‌ర‌లో ఆపిల్‌, డిస్నీ కూడా ఈ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నాయి. వీటి గురించి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్‌బాబు సోమావారం ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఎన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు వున్నా బ‌ల‌మైన కంటెంట్ ఇచ్చేవాడే ఇక్క‌డ నిల‌బడ‌తాడ‌ని, వేల కోట్ల‌తో వున్న అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ, ఆపిల్ డిజిట‌ల్ రంగంలో ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌తాయో వారికే తెలియాల‌ని సురేష్‌బాబు సెటైర్లు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాలు నిర్మిస్తూనే నెట్‌ఫ్లిక్స్ త‌ర‌హాలో డి. సురేష్‌బాబు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్‌, దిల్ రాజుతో పాటు మ‌రి కొంత మంది బ‌డా నిర్మాత‌లు, వ్యాపార వేత్త‌లు క‌లిసి ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. దీని ద్వారా వారు నిర్మించిన చిత్రాల్ని వారే మార్కెట్ చేసుకోవాల‌ని ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నారు. డిజిట‌ల్ రంగంలో రారాజులుగా వెలిగిపోతున్న నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల‌ని త‌ట్టుకుని ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌తార‌న్నది ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.