సురేష్ బాబుకి ప్లాప్ డైరెక్టర్లు అంటే ఎందుకంత ఇష్టం!


Suresh Babu interested to work with flop directors
Suresh Babu interested to work with flop directors

ఎవరైనా హిట్ ఉన్న దర్శకుల వెంట పడతారు. సినిమా ఇండస్ట్రీ నడిచేది హిట్ సూత్రం ఆధారంగానే. ఇక్కడ వాడు చెప్పిందే వేదం. తీసేదే సినిమా. హిట్ ఉందంటే అంతలా మాట చెల్లుబాటైపోతుంది. హిట్ లేకపోతే మొహం చాటేసేవాళ్ళే. అయితే అగ్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం ప్లాప్ దర్శకులు అంటే ఇష్టం పెంచుకుంటున్నాడు. తన బ్యానర్ లో తెరకెక్కే సినిమాలకు దర్శకులు ఎక్కువగా ప్లాపుల్లో ఉన్నవాళ్లే. అయితే దీనికి ఒక రీజనింగ్ కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. సురేష్ బాబు ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది. నిర్మాతగా అగ్ర స్థానంలో ఇన్నాళ్ల నుండీ ఉంటున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. లెక్కల విషయంలో కచ్చితంగా ఉండే సురేష్ బాబు ఎందుకని ప్లాప్ నిర్మాతలను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే దానికి చెప్పిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా.. నిజమే కదా అనిపిస్తోంది కూడా.

హిట్ వచ్చిన దర్శకులకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కు దారి తీయొచ్చు లేదా స్క్రిప్ట్ విషయంలో అజాగ్రత్తగా ఉండే అవకాశమూ లేకపోలేదు. అందరూ అలా ఉంటారని కాదు కానీ చాలా మటుకు అలాగే జరుగుతుంది. అదే ప్లాప్ దర్శకుడు అయితే హిట్ కొట్టాలన్న కసి ఉంటుంది. ఇది వరకు ప్రూవ్ చేసుకున్న దర్శకులు ఇప్పుడు ప్లాప్ లో ఉంటే వారికి ఆ కసి మరింత ఎక్కువ ఉంటుంది. ఎలాగైనా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడతారు. ఏదైనా సలహా ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఉంటారు. ప్లాప్ లో ఉంటారు కాబట్టి నిర్మాత కష్టాలు తెలుస్తాయి, బడ్జెట్ నియంత్రణ గురించి కొంత అవగహన ఉంటుంది. ఈ కారణాలతో సురేష్ బాబు ప్లాప్ దర్శకులతో పనిచేయడానికి మక్కువ చూపుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం నారప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ అడ్డాల దారుణమైన ప్లాప్ ను మూటగట్టుకుని మూడేళ్లు సినిమా లేక ఇబ్బంది పడ్డాడు. అందుకే నారప్ప విషయంలో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.