ఇష్టం లేకే ఆ తేదీని ఎంచుకున్న సురేష్ బాబు


suresh babu locks venky mama release date without much interest
suresh babu locks venky mama release date without much interest

వెంకీ మామ రిలీజ్ డేట్ మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా విడుదల తేదీ రాలేదు కానీ డిసెంబర్ 13న విడుదలకు చూస్తున్నామని సురేష్ బాబు చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వెంకీ మామను విడుదల చేస్తున్నామని తెలిపాడు. ఇప్పటిదాకా వెంకటేష్ కెరీర్ లో ఒక్కసారి కూడా డిసెంబర్ 13న వెంకీ చిత్రం విడుదల కాలేదు. కానీ తొలిసారి అవుతోంది. అంటే దానర్ధం ఏంటి? ఆ డేట్ అంత మంచిది కాదనే కదా. కానీ ఈసారి మాత్రం ఎందుకు విడుదల చేస్తున్నట్లు? ఎందుకంటే సురేష్ బాబుకు ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు.

సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూసాడు, పనవ్వలేదు. డిసెంబర్ లో కలిసొచ్చే సీజన్ క్రిస్మస్ కు అనుకున్నారు కానీ అప్పటికే రెండు చిత్రాలు విడుదలకు ఉండడంతో సురేష్ బాబు వద్దనుకున్నాడు. వెంకీ మామకు పెట్టిన బడ్జెట్ కు సోలో రిలీజ్ అయితేనే పనవ్వుతుంది. అందుకే డిసెంబర్ 13న విడుదల చేద్దామనుకుంటున్నాడు. నిజానికి ఈ విడుదల తేదీ కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. బహిరంగంగానే సురేష్ బాబుకు ఈ డేట్ వద్దంటున్నారు. అసలు ఒక్క సెలవు కూడా లేని ఈ రిలీజ్ డేట్ కలిసిరాదని అభిప్రాయపడుతున్నారు. సురేష్ బాబు కూడా ఎప్పుడూ తాను రిలీజ్ డేట్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వనని, కానీ తొలిసారి వెంకీ మామ రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కానీ సురేష్ బాబు ముందు మరొక ఆప్షన్ లేదు. డిసెంబర్ 13 కూడా వదులుకుంటే ఫిబ్రవరి దాకా సరైన రిలీజ్ డేట్ లేదు. అందుకే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి ఇష్టం లేకుండా డిసెంబర్ 13న వెంకీ మామను విడుదల చేస్తున్న సురేష్ బాబు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడా చూడాలి.