2020 ఇయ‌ర్ సురేష్ ప్రొడక్ష‌న్స్‌దేనా?Suresh Babu planing to six films in 2020
Suresh Babu planing to six films in 2020

2017లో ఆరు చిత్రాల్ని రిలీజ్ చేసి దిల్ రాజు డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇప్ప‌డు అదే ఫీట్‌ని నిర్మాత సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రిపీట్ చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. రీసెంట్‌గా `వెంకీమామ‌`తో హిట్‌ని సొంతం చేసుకున్న ఆయ‌న‌  ఇందు కోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సురేష్ బాబు వ‌చ్చే ఏడాది 2020లో వ‌రుస‌గా ఆరు చిత్రాల్ని రిలీజ్ చేసి రికార్తు సృష్టించ‌బోతున్నారట‌. గ‌త కొంత కాలంగా చిన్న చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిర‌స్తూ అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే భారీ సినిమాలు నిర్మిస్తున్నారాయ‌న‌.

ఈ ఏడాది టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌తో క‌లిసి `ఓ బేబీ`, వెంకీ మామ చిత్రాల్ని నిర్మించిన సురేష్‌బాబు 2020లో మాత్రం వ‌రుస‌గా ఆరు చిత్రాల్ని నిర్మించ‌డానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో రానా, గుణ‌శేఖ‌ర్‌ల క‌ల‌యిక‌లో రాబోతున్న మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌` ఒక‌టి. హాలీవుడ్ చిత్రాల‌కు ఏ మాత్రం తీసిపోని  స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. గ‌త రెండేళ్లుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని నెక్ట్స్ ఇయ‌ర్ తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `అసుర‌న్‌`ని తెలుగులో వెంక‌టేష్‌తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనితో పాటు ఆయుష్మాన్ ఖురానా న‌టించిన `డ్రీమ్ గాళ్`, కార్తిక్ ఆర్య‌న్ చేసిన‌ `సోనూ కె టి టు కి స్వీటీ` వంటి రెండు బాలీవుడ్ చిత్రాల్ని కూడా రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన `సోనూ కె టి టు కి స్వీటీ` రీమేక్ ప‌నులు ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కానున్నాయ‌ట‌. ఇవే కాకుండా మ‌రో రెండు కొరియ‌న్ చిత్రాల్ని కూడా రీమేక్ చేస్తున్న‌ట్టు నిర్మాత డి. సురేష్‌బాబు ప్ర‌క‌టించారు.