సినీ వ‌ర్క‌ర్స్‌, వైద్య సిబ్బందికి ద‌గ్గుబాటి ఫ్యామిలీ అండ‌!సినీ వ‌ర్క‌ర్స్‌, వైద్య సిబ్బందికి ద‌గ్గుబాటి ఫ్యామిలీ అండ‌!
సినీ వ‌ర్క‌ర్స్‌, వైద్య సిబ్బందికి ద‌గ్గుబాటి ఫ్యామిలీ అండ‌!

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఎక్క‌డ చూసిన క‌రోనా మ‌ర‌ణాలే. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్  లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ క‌రోనా మ‌ర‌ణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో దేశాల‌న్నీ నిర్భంధ క‌ర్ఫ్యూకు నాంది ప‌లికాయి. లాక్ డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో స‌మాన్య జ‌నం ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వీరి కోసం సినీ ప్ర‌ముఖులంతా ముందుకొచ్చి స‌హాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. కొంత మంది ప్ర‌ధాని స‌హాయ నిధికి, మ‌రి కొంత మంది ఇరు రాష్ట్రాల సీఎంల స‌హాయ నిధికి నిధులు అందిస్తుంటే కొంత మంది మాత్రం సినీ వ‌ర్క‌ర్ల కోసం విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు.

ఇందులో భాగంగా క‌రోనాపై పోరాటం కోసం తాము సైతం అంటూ ద‌గ్గుబాటి ఫ్యామిలీ కూడా ముందుకొచ్చింది. క‌రోనా వ్యాప్తిని నిరోధిస్తూ నిరంత‌రం వైద్య సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు క‌రోనా కార‌ణంగా బంద్ కావ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్న వారి కోసం ద‌గ్గుబాటి ఫ్యామిలీ కోటి స‌హాయాన్ని ప్ర‌క‌టించింది.

రోజు వారి వేత‌నంతో జీవించే సినీ కార్మికులు నిత్యావ‌సరాల కోసం కష్ట‌ప‌డుతున్నారని, వాళ్ల‌ని ఆదుకోవావ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించి వారికి ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నామ‌ని డి. పురేష్ బాబు, వెంక‌టేష్‌, రానా తెలిపారు. అలాగే త‌మ జీవితాల‌కు ప్ర‌మాదం వుంద‌ని తెలిసినా నిత్యం రోగుల‌తో స‌న్నిహితంగా మెలుగుతూ వారి ఆరోగ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తూ వ‌స్తోంది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా వంతు బాధ్య‌త‌గా ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా ద‌గ్గుబాటి ఫ్యామిలీ స‌భ్యులు తెలిపారు.