సూర్య డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నారా?


Suriay playing double role in hari film
Suriay playing double role in hari film

హీరో సూర్య డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నారా? అంటే త‌మిళ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో నూపొందుతున్న `సూర‌రాయిపోట్రు` చిత్రంలో న‌టిస్తున్నారు. సుధా కొంగ‌ర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఏప్రిల్ 9న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఇటీవ‌ల విడుద‌లై ఈ చిత్ర టీజ‌ర్‌, మోహ‌న్‌బాబు క్యారెక్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే సూర్య మ‌రో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌.

వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `సింగం` సిరీస్ చిత్రాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనూహ్య విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా బాలీవుడ్‌లోనూ రీమేక్ అయి మంచి వ‌సూళ్ల‌ని సాధించాయి. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకున్న సూర్య మాస్ డైరెక్టర్ హ‌రితో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌క్క‌నున్న ఈ చిత్రంలో సూర్య అన్నా త‌మ్ములుగా ద్విపాత్రాభినం చేయ‌నున్నాడ‌ని తెలిసింది. ఇది సూన్య ఫ్యాన్స్‌కి నిజంగా డ‌బుల్ ధ‌మాకానే.