యాత్ర 2 చేస్తానంటున్న సూర్య


యాత్ర 2 చిత్రంలో జగన్ పాత్రలో నటించడానికి నేను సిద్ధం అంటూ ప్రకటించాడు తమిళ స్టార్ హీరో సూర్య . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాత్ర హిట్ కావడంతో యాత్ర 2 చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ యాత్ర 2 జగన్ పాదయాత్ర నేపథ్యంలో సాగుతుంది . ప్రజా సమస్యల కోసం జగన్ చేసిన పాదయాత్ర ఎలాంటి మలుపులు తిరిగింది , రాజకీయంగా జగన్ ని ఎలా నిలువరించాలని అనుకున్నారు తదితర అంశాలతో యాత్ర 2 చిత్రం తెరకెక్కనుంది .

అయితే కథ , కథనం పక్కాగా వస్తే …… సరైన మేకర్స్ నన్ను కలిస్తే యాత్ర 2 చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే పక్కాగా కథ సెట్ అయితేనే చేస్తానని అంటున్నాడు సూర్య . ఈ హీరో నటించిన ” ఎన్ జి కే ” ఈనెల 31 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సూర్య జగన్ చిత్రం పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు .