శంక‌ర్ కోసం సూర్య ఓకే అంటున్నాడా?

శంక‌ర్ కోసం సూర్య ఓకే అంటున్నాడా?
శంక‌ర్ కోసం సూర్య ఓకే అంటున్నాడా?

దిగ్రేడ్ డైరెక్ట‌ర్ శంక‌ర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌లో దిల్ రాజు భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ఇటీవ‌లే ప్ర‌క‌టించి‌యిన విష‌యం తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ లో50వ చిత్రంగానూ రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల 15వ చిత్రంగానూ ఈ మూవీ తెర‌పైకి రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి రానున్న ఈ మూవీలో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కొరియా న‌టి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. దీనిపై మేక‌ర్స్ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఖండించ లేదు కూడా. ఇదిలా వుంటే ఈ మూవీకి స‌బంధించిన మ‌రో హాట్ న్యూస్ మీడియా స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ పాన్ ఇండియా మూవీ స్టోరీని కీల‌క మ‌లుపు తిప్పే ఓ కీల‌క‌ పాత్ర వుందంట‌. ఆ పాత్ర కోసం హీరో సూర్య‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ సంప్ర‌దించార‌ని తాజా టాక్‌. శంక‌ర్ కోసం ఈ చిత్రంలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి సూర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. శంక‌ర్‌తో ఇంత వ‌ర‌కు సూర్య ఒక్క మూవీ కూడా చేయ‌లేదు. ఆ కార‌ణంగానే ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించే అవ‌కాశం వుంద‌ని టాక్‌. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే సూర్య లేదా దిల్ రాజు స్పందించాల్సిందే.