భూమికి ఆకాశానికి మ‌ధ్య ప్ర‌మోష‌న్స్‌!


భూమికి ఆకాశానికి మ‌ధ్య ప్ర‌మోష‌న్స్‌!
భూమికి ఆకాశానికి మ‌ధ్య ప్ర‌మోష‌న్స్‌!

ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా, కంటెంట్ అద్భుతంగా వున్నా దాన్ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లిన‌ప్పుడే ఆ సినిమాకు ఆద‌ర‌ణ లేదంటే ఆ సినిమాని ప‌ట్టించుకునే నాధుడే వుండ‌రు. ఎంత ప్ర‌చారం చేస్తే అంత బాగా రీజ్ అవుతుంది. ప్ర‌స్తుతం ఇదే సూత్రాన్ని హీరో సూర్య టీమ్ పాటిస్తోంది. హీరో సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం `సూర‌రాయిపోట్రు`. సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ కాబోతంంది. ఏయిర్ డెక్క‌న్ పౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ సామాన్య‌డి అసామాన్య‌మైన క‌ల నేప‌థ్యంలో ఆద్యంతం వాస్త‌వికంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సింగ‌ర్ అప‌ర్ణా బాల‌ముర‌ళి ఈ చిత్రంలో హీరో సూర్య‌కు జోడీగా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ చిత్ర ప్ర‌చారం కోసం యూనిక్ వేని ఎంచుకున్నారు. సినిమా క‌థ‌కి అనుగుణంగా ప్ర‌మోష‌న్స్‌ని కూడా కొత్త‌గా ప్లాన్ చేశారు. ఆడియో రిలీజ్‌ని చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఏయిర్‌పోర్ట్‌లో ప్లాన్ చేసిన చిత్ర బృందం ఒక్కో పాట‌ని ఒక్కొ స్టైల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నెల 13న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని భూమికి ఆకాశానికి మ‌ధ్య‌న రిలీజ్ చేస్తున్నారు. ఇందు కోసం స్పైస్ జెట్ బోయింగ్ 737ని బుక్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇందుకు అంగీక‌రించిన‌ స్పైస్ జెట్ చైర్మ‌న్‌కి చిత్ర బృందం అభినంద‌న‌లు తెలియ‌జేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Credit: Twitter