సూర్య, వెట్రిమారన్ ల వడివాసల్, రచ్చ గ్యారంటీలా ఉందే!

సూర్య, వెట్రిమారన్ ల వడివాసల్, రచ్చ గ్యారంటీలా ఉందే!
సూర్య, వెట్రిమారన్ ల వడివాసల్, రచ్చ గ్యారంటీలా ఉందే!

సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అతని డబ్బింగ్ సినిమాలు మంచి బిజినెస్ చేస్తాయి. గత కొంత కాలంగా ప్లాపులతో ఇబ్బంది పడుతోన్న సూర్య ఆకాశం నీ హద్దురా చిత్రంతో మళ్ళీ ఫామ్ ను అందుకున్నాడు. ఈ చిత్రం సూర్యకు నటుడిగా చాలా పేరు తీసుకొచ్చింది.

ఆకాశం నీ హద్దురా తర్వాత పాండిరాజ్ దర్శకత్వంలో ఒక ఆసక్తికరమైన సినిమా చేస్తోన్న సూర్య దాని నెక్స్ట్ సినిమాను కూడా ప్రకటించేశాడు. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య సినిమా చేయబోతున్నాడు. వెట్రిమారన్ ఇప్పటిదాకా ఐదు సినిమాలు మాత్రమే చేసాడు.

ఈ ఐదు చిత్రాలతో బోలెడన్ని అవార్డులను మూటగట్టుకున్నాడు. పైగా ఈ ఐదు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఇప్పటిదాకా ధనుష్ తోనే సినిమా చేసిన వెట్రిమారన్ తన తర్వాత చిత్రం సూర్యతో ఉంటుందని ప్రకటించిన దగ్గరనుండి సూర్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. స్వతహాగా మంచి నటుడైన సూర్య, వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడంటే అవార్డు పక్కా చేసుకోవచ్చు. వడివాసల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జల్లికట్టు నేపథ్యంలో సాగుతుంది.