కోలుకున్న సూర్య‌…ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌!

Suriya recovered its a good news for fans
Suriya recovered its a good news for fans

చాలా రోజుల త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కోసం చిన్న పాట య‌జ్ఞ‌మే చేశారు హీరో సూర్య‌. ఆయ‌న న‌టించిన `ఆకాశం నీ హ‌ద్దురా` ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ స‌క్సెస్ జోష్‌లో వున్న ఆయ‌న రెట్టించిన విశ్వాసంతో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇటీవ‌లే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇటీవ‌ల కోవిడ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో హీరో సూర్య ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేక‌పోయారు. గ‌త కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న తాజాగా అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. సూర్య‌కు క‌రోనా సోకింద‌ని తెలిసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

అయితే తాజాగా జ‌రిపిన టెస్టుల్లో సూర్య అన్న‌కు నెగ‌టివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న స‌న్నిహితుడు రాజ‌శేఖ‌ర పాండియ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో సూర్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అన్న తాజా టెస్ట్‌లో నెగెటివ్ వ‌చ్చింది. మీ అంద‌రికి ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు` అని ట్వీట్ చేశారు రాజ‌శేఖ‌ర పాండియ‌న్.