సింగ‌ర్‌గా మారిన త‌మిళ హీరో!Suriya sing a song for soora rai pottru
Suriya sing a song for soora rai pottru

మ‌న హీరోలు సంద‌ర్భాన్ని బ‌ట్టి త‌మ‌లోని కొత్త టాలెంట్‌ని బ‌య‌టికి తీసుకొస్తుంటార‌న్న విష‌య‌యం తెలిసిందే. కొంత మంది ఫైట‌ర్స్‌గా, కొంత మంది డా్య‌న్స‌ర్స్‌గా, మ‌రి కొంత మంది సంగీత ద‌ర్శ‌కులుగా, డైరెక్ట‌ర్‌లుగా త‌మలోని ఎక్స్‌ట్రా ప్ర‌తిభ‌ని బ‌య‌ట‌పెట్టేస్తుంటారు. తాజాగా హీరో సూర్య త‌న‌లోని సింగ‌ర్‌ని బ‌య‌టికి తీశారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

`సూర‌రాయ్ పోట్రు` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఏయిర్ డెక్క‌న్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా హీరో సూర్య అ చిత్రంలో క‌నిపిస్తున్నారు. మోహ‌న్‌బాబు, జాకీష్రాఫ్, ప‌రేష్‌రావ‌ల్‌, ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జీవీ ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం హీరో సూర్య ఓ పాట పాడారు. అయితే అది త‌మిళంలో. ఈ పాట ఫ్యాన్స్‌కి ఓ ట్రీట్‌లా వుంటుంద‌ని జీవి ప్ర‌కాష్ అంటున్నారు. సూర్య పాట పాడిన విజువ‌ల్స్‌కి సంబంధించిన వీడియోని తాజాగా జి.వి.ప్ర‌కాష్‌కుమార్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేశారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.