రిలీజ్‌కు ముందే లాభాల బాట ప‌ట్టిందే!


Suriya Soorarai Pottru Pre release business
Suriya Soorarai Pottru Pre release business

విభిన్న‌మైన చిత్రాల‌తో పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటారు హీరో సూర్య‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న చేస్తున్న ప్ర‌యోగాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లించ‌డం లేదు. దాంతో తానే నిర్మాత‌గా మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యారు. సూర్య న‌టిస్తున్న తాజా త‌మిళ‌ చిత్రం `సూరారై పోట్రు`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో హీరో సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్నారు.

ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. తెలుగులో `ఆకాశ‌మే నీహ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ టీజ‌ర్‌ని ఇటీవ‌లే రిలీజ్ చేశారు. మోహ‌న్‌బాబు వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల్లోనే కాదు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

15 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప‌గ‌డ్బందీ ప్లాన్‌తో ఎక్క‌డా ఎలాంటి వేస్టేజీ లేకుండా నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్రీరిలీజ్ బిజినెస్‌తో 40 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. తీసి బ‌డ్జెట్‌తో పోలిస్తే ఈ సినిమా మేక‌ర్స్ లాభాల్లో వున్న‌ట్టే. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏప్రిల్ 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.