తొలి రోజే గ‌న్ ప‌ట్టిన సూర్య‌!

Suriya starts pandi raj movie shoot
Suriya starts pandi raj movie shoot

గ‌త‌ ఏడాది న‌వంబ‌ర్‌లో `సూర‌రైపోట్రు` తెలుగులో ఆకాశ‌మే నీ హ‌ద్దురా` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు హీరో సూర్య‌. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయ‌న‌కు ఈ సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ ల‌భించింది. ఈ సినిమా స‌క్సెస్ ఆనందంలో రెట్టించిన ఉత్సాహంతో వున్న సూర్య పాండిరాజ్ తో కొత్త చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు.

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవ‌లే సూర్య లేకుండానే లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. క‌రోనా వైర‌స్ సోక‌డంతో క్వారెంటైన్‌కి ప‌రిమిత‌మైన సూర్య ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి దూరంగా వుండాల్సి వ‌చ్చింది. క‌రోనా నుంచి కోలుకున్న ఆయ‌న తాజాగా ఈ మూవీ షూట్‌లో పాల్గొన్నారు.

తొలి షెడ్యూల్‌లో మొత్తం యాక్ష‌న్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. సూర్య సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫొటోని చిత్ర బృందం షేర్ చేసింది. తొలి రోజు సూర్య గ‌న్ ప‌ట్టుకుని క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంది. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ మూవీలో కార్తి ఓ అతిథి పాత్ర‌లో మెర‌వ నున్నార‌ని తెలిసింది.