క‌రోనా ఎఫెక్ట్ : వ‌చ్చే ఏడాదికి మారిన సూర్య సినిమా!


క‌రోనా ఎఫెక్ట్ : వ‌చ్చే ఏడాదికి మారిన సూర్య సినిమా!
క‌రోనా ఎఫెక్ట్ : వ‌చ్చే ఏడాదికి మారిన సూర్య సినిమా!

విభిన్న చిత్రాలతో హీరోగా ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సూర్య పుట్టిన రోజు నేడు (గురువారం). ఈ రోజుతో ఆయ‌న 45వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీహ‌ద్దురా` చిత్రంలోని `కాటుక క‌నులే..` అంటూ సాగే పాట‌ని చిత్ర బృందం గురువారం విడుల చేసింది. సూర్య హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి  `గురు` ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‌2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక విధంగా జీ.ఆర్‌. గోపీనాథ్ బ‌యోపిక్ అనుకోవ‌చ్చు. ఇందులో మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంతా స‌వ్యంగా వుంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా ప్లాన్ మొత్తం మారిపోయింది. వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తుండ‌టంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆగిపోయింది.

దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రింట్ ల్యాబ్‌లోనే వుండిపోయింది. ఈ కార‌ణంగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి వాయిదా వేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆగిపోవ‌డం, థియేట‌ర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.