సూర్య ఎన్ జి కే ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిsuriyas ngk first review out

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్ జి కే ఈనెల 31 న విడుదల అవుతుండగా రెండు రోజుల ముందే ఎన్ జి కే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది . యు కె అండ్ యు ఏ ఈ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సందు ఈ రివ్యూ ఇచ్చాడు . ఇంతకీ ఉమైర్ ఈ సినిమా గురించి ఏమన్నాడో తెలుసా …….. ఎప్పటి లాగే బాక్స్ లు బద్దలైపోతాయి తమిళనాట , సూర్య వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు అంటూ ఊకదంపుడు ఉపన్యాసం లా తేల్చేసాడు .

ఉమైర్ సందు విడుదల అవుతున్న ప్రతీ పెద్ద సినిమాకు ఇలాగె రివ్యూ ఇస్తున్నాడు కట్ చేస్తే వాటిలో హిట్స్ వేళ్ళ మీద లెక్కించగట్ట స్థాయిలో మాత్రమే ఉండగా ఎక్కువ శాతం డిజాస్టర్ లే ! ఇక ఇప్పుడు ఎన్ జి కే నంద గోపాల కృష్ణ అనే చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నాడు మరి . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఎన్ జి కే పై సూర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు ఎందుకంటే గతకొంత కాలంగా ఈ హీరోకు కమర్షియల్ హిట్ లేదు పాపం . రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు .