ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌లో సూర్య మూవీ!

ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌లో సూర్య మూవీ!
ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌లో సూర్య మూవీ!

విభిన్న క‌థా చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్న‌రు హీరో సూర్య‌. ఆయ‌న న‌టించిన తాజా త‌మిళ‌ చిత్రం `సూరారైపోట్రు`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో హీరో సూర్య‌తో క‌లిసి గుణీత్ మోంగా నిర్మించారు. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అయింది.

ఇదే చిత్రాన్ని తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దు రా` పేరుతో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో రెండు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఏయిర్ డెక్క‌న్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు జీ.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరో సూర్య‌తో పాటు సుధా కొంగ‌ర‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించేలా చేసింది.

ఈ సినిమా మ‌న ఇండియా త‌రుపున 93వ ఆస్కార్ బ‌రిలోకి ఎంట్రీ సాధించిన విష‌యం తెలిసిందే. అయితే వ‌ర్ల‌డ్ వైడ్‌గా ఈ విభాగంలో పోటీప‌డుతున్న చిత్రాల్ని తాజాగా తాజాగా షార్ట్ లిస్ట్ చేశారు. ఆ లిస్ట్‌లో 366 చిత్రాలు నిలిచారు. అందులో మ‌న ఇండియా త‌రుపున `సూరారైపోట్రు` కూడా వుండ‌టం విశేషం. మార్చి 15న ఆస్కార్ అవార్డుల ప్ర‌దానం జ‌ర‌గ‌నుంది.