భారీ కటౌట్ తో రికార్డ్ బ్రేక్ చేసిన ఫ్యాన్స్


సూర్య హీరోగా నటించిన ” ఎన్ జీకే ” రేపు భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో సూర్య అభిమానులు భారీ కటౌట్ ని ఏర్పాటు చేయించి రికార్డ్ బ్రేక్ చేసారు . ఇంతకీ ఈ కటౌట్ ఎత్తు ఎంతో తెలుసా ……. దీనికైన ఖర్చు ఎంతో తెలుసా …….. కటౌట్ ఎత్తు 215 అడుగులు కాగా దీనికి 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది అంతేకాదు 35 రోజుల పాటు 40 మంది కార్మికులు కస్టపడి పనిచేస్తే ఈ కటౌట్ సాధ్యమయ్యింది .

భారతదేశంలోనే ఈ కటౌట్ భారీది అనే చెప్పాలి , ఎందుకంటే ఇప్పటివరకు 180 అడుగుల కటౌట్ అజిత్ ది ఏర్పాటు చేసారు ఫ్యాన్స్ , దాంతో ఆ రికార్డ్ ని బద్దలు కొట్టారు సూర్య ఫ్యాన్స్ . తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లా అభిమానులు ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ఇక రేపు విడుదల కానున్న ఎన్ జీకే ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే .