ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి…హీరోతో కూడా కొట్టించాలి


Suriya And Bala
ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి. ..హీరోతో కూడా కొట్టించాలి

జనరల్ గా దర్శకులు, కథానాయకులు ఫ్లాప్స్ లిస్ట్ లో ఉంటే జనాల నుండి అంతగా మద్దతు రాదూ… కారణం వారి ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ చేసుకోలేరు, తర్వాతి సినిమాకి అయిన శ్రద్ధగా, జాగ్రత్తగా పని చేస్తారని కూడా నమ్మకం ఉండదు. అలాంటి కాంబినేషన్ ఒక్కటి తమిళ పరిశ్రమలో రెడీ అవుతుంది.

దర్శకుడు ‘బాల’, ‘సూర్య’ కలయికలో ఇదివరకే 2 సినిమాలు వచ్చాయి అందులో “పితామగన్ (శివ పుత్రుడు)” , “నంద (ఆక్రోశం)” రిలీజ్ అయ్యాయి. చూసుకుంటే శివ పుత్రుడు సినిమాలో సూర్య నటన అందరిని కట్టి పడేసింది. ఆ సినిమా తర్వాతనే ‘గజినీ’ , యముడు, 24 సినిమాల ద్వారా సూర్యకి తెలుగులో మార్కెటింగ్ బాగా పెరిగింది.

అయితే ఈ మధ్య సినిమాల విషయంలో ఇద్దరు చాల వెనుకబడ్డారు. సూర్యకి ఏమో “బందోబస్త్”, “ఎన్.జి.కె” సినిమాలు భారీ ఫ్లాప్స్ ని ఇచ్చాయి. అలాగే బాల గారు కూడా చేసిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ కూడా ట్రైలర్ దగ్గరే గట్టి ఫ్లాప్స్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాని బాల చేతుల నుండి వేరే దర్శకులకి ఇచ్చేసారు. అలాగా ఇద్దరు ఇప్పుడు కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ తిరిగి వచ్చింది.

‘సుధ కొంగర’ [‘గురు (వెంకటేష్)’] దర్శకురాలు ఒక ఇండియన్ ఏయిర్ డెక్కన్ పైలట్ ‘జీ.ఆర్ గోపీనాథ్’ పౌండర్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాని చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఈ సినిమాకి టైటిల్ `సూరరాయ్ పోట్రు` అనుకుంటున్నారు. అలాగే అదే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించారు కూడా. ఈ సినిమాకి హీరో సూర్య అయితేనే బాగుంటుంది అని చెప్పి మరి సూర్య ని తీసుకున్నారంటా. ఇందులో సూర్య కథానాయకుడే కాదు, స్వయంగా తాను కూడా 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాతల్లో ఒకరుగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పని జరుపుకుంటుంది ఈ సినిమా.

ఇందులో అధర్వ మురళి.. ఆర్య లాంటి యంగ్ హీరోలు నటించబోతున్నారు. సూర్య మరియు బాల కలయికలో రాబోతున్న మూడవ సినిమా ఇది. బాల గారి సినిమాలు అంటే చాలా నేటివిటీ కి దగ్గరగా ఉంటాయి. అతని సినిమాలు జనాలని ఆలోచింప చేస్తాయి. అందుకేనేమో బాలకి పిలిచి మరి ఆఫర్ ఇచ్చారంటా సూర్య గారు. మరి అనుకున్నట్టు గా బాల గారు సూర్యకు గట్టిగా హిట్టిస్తాడా? లేదా? అన్నది వచ్చే ఏడాది తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకోనుంది.