హిట్టుకోసం సూర్య ఆలస్యంగా వస్తాడట…


Suriya movie postponed in Telugu
Suriya movie postponed in Telugu

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పట్లో కనిపించేలా లేడు. చాలా వరకు ఫెస్టివల్స్ ని టార్గెట్ చేసే సూర్య ఈ సారి క్రిస్మస్ – సంక్రాంతిని మిస్ చేసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవాలని,  స్ట్రాంగ్ కంటెంట్ తో రావాలని ఫిక్స్ అయ్యాడట. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సురారై పోట్రు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

అయితే మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జనవరిలో పొంగల్ కి రిలీజ్ చేయాలనీ నిర్మాతలు డిస్కస్ చేసుకున్నారు. కానీ సూర్య ఆ డేట్ ని ఇష్టపడటం లేదు. డైరెక్టర్ సుధా కొంగర పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా జరగాలని రిక్వెస్ట్ చేయడంతో సూర్య కూడా సినిమాను జనవరికి వద్దని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

కూల్ గా సినిమాను సమ్మర్ బరిలో పెద్దగా పోటీ లేకుండా సినిమాను రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్య బందోబస్త్ తమిళంలో 100కోట్ల కలెక్షన్స్ తో  మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. సూర్య గత సినిమాలు కూడా తెలుగులో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. ఇక ఇప్పుడు సురారై పోట్రు కథను ఒకేసారి తెలుగులో కూడా భారిగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.