వెట్రిమార‌న్ కోసం సూర్య కొత్త అవ‌తారం!


వెట్రిమార‌న్ కోసం సూర్య కొత్త అవ‌తారం!
వెట్రిమార‌న్ కోసం సూర్య కొత్త అవ‌తారం!

విభిన్న‌మైన చిత్రాల‌తో సూర్య త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. క‌మ‌ల్‌, విక్ర‌మ్‌ల త‌రువాత కొత్త త‌ర‌హా చిత్రాల‌కు సూర్య కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. `పితామ‌గ‌న్‌`( శివ‌పుత్రుడు) నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించిన సూర్య మ‌రోసారి త‌న‌దైన పంథాలో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. ప్ర‌స్తుతం `గురు` ఫేమ్  సుధాకొంగ‌ర దర్శ‌క‌త్వంలో `సూరరాయి పోట్రు` చిత్రంలో న‌టిస్తున్నారు.

ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌యి రిలీజ్‌కు రెడీగా వుంది. ఇదిలా వుంటే ఇటీవ‌ల హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అంగీక‌రించిన సూర్య తాజాగా వెట్రిమార‌న్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.  `వా‌డివాస‌ల్‌` అనే పేరుతో ఈ చిత్రాన్ని క‌లైపులి ఎస్ థాను తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

జ‌ల్లిక‌ట్టు ఆధారంగా గ్రామీణ నేప‌థ్యంలో సాగే మాసీవ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.`అసుర‌న్‌` ఫేమ్ వెట్రి మార‌న్ తెర‌కెక్కించ‌నున్న సినిమా కావ‌డం, ఇందులో సూర్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌నుండ‌టం వంటి ప్ర‌త్యేక‌త‌ల కార‌ణంగా ఈ చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ కార‌ణంగానే హ‌రి చిత్రం కంటే ముందే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని హీరో సూర్య సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంద‌ని తెలిసింది.  ఇందులో సూర్య గెట‌ప్ చాలా మాసీవ్‌గా బారు గ‌డ్డంతో వుంటుంద‌ని, వెట్రిమార‌న్ కోసం సూర్య ఈ చిత్రంలో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నార‌ట.