“ఆకాశం నీ హద్దురా.!” అంటున్న సూర్య


“ఆకాశం నీ హద్దురా.!” అంటున్న సూర్య
“ఆకాశం నీ హద్దురా.!” అంటున్న సూర్య

కొత్త సంవత్సరం తొలి రోజు అనేక సినిమాలకు సంబంధించిన విశేషాలు అభిమానులను పలకరించాయి. తమిళ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం “ఆకాశం నీ హద్దురా.!” సినిమా పోస్టర్ ని కూడా సదరు చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా టీజర్ ను జనవరి 7న రిలీజ్ చేయ్యబోతున్నట్లు కూడా ప్రకటించారు. సూర్య గత ఏడాది N.G.K & కాప్పాన్ సినిమాలతో ప్రేక్షకుల మున్ధూ వచ్చినా, అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండు సినిమాలు కథ, స్క్రీన్ ప్లే పరంగా బాగున్నా, రెండు రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలు అయినప్పటికీ ఆడియెన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సూర్య గతంలో మాధవన్ తో “సాలా ఖద్దూస్” సినిమా చేసిన మహిళా దర్శకురాలు సుధ కొంగర తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సుధ తన గత చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో “గురు” పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో కూడా ఆ సినిమా హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో అపర్ణ బాలాజీ, జాకీ ష్రాఫ్, మోహన్ బాబు వంటి అగ్ర నటీనటులు పనిచేస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. “మీ జీవితం, ఈ ఏడాది గొప్ప సంఘటనలతో నిండాలని కోరుకుంటున్నా” అని సూర్య భావోద్వేగభరితమైన ట్వీట్ చేసారు.