మంచు ఫ్యామిలీ తో కలవనున్న ‘సింగం’.. తెలుగులో సినిమా….


Surya new movie with Mohan Babu
మంచు ఫ్యామిలీ తో కలవనున్న ‘సింగం’.. తెలుగులో సినిమా….

శివ పుత్రుడు, గజిని, ఆరు, యముడు, సింగం, గ్యాంగ్ సినిమాల ద్వారా తెలుగు నాట ‘సూర్య‘కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి సూర్య సినిమాలు డబ్బింగ్ ద్వారా రిలీజ్ చేస్తే ఎంతలేదు అనుకున్న 20 నుండి 40 కోట్ల వరకు మంచి మార్కెటింగ్ చేస్తాయి అతని సినిమాలు.

అయితే సంవత్సరం నుండి సూర్య సినిమాల పరిస్థితి అంతగా బాగాలేదు. తమిళంలో, తెలుగులో వచ్చిన సినిమాలు అన్ని వారం రోజుల వ్యవధిలోనే తిరుగు ప్రయాణము  అవుతున్నాయి. అలా అని ఇంకొక సినిమాకి గ్యాప్ తీస్కొని చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. బందోబస్త్ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు కూడా అవ్వలేదు ఇంతలోనే ‘సుధ కొంగర’ దర్శకత్వంలో ‘సురరై పోట్రు’ సినిమాని సిద్ధం చేస్తున్నాడు.

బందోబస్త్ తెలుగు ప్రమోషన్స్ కి వచ్చిన సూర్య ‘మంచు’ ఫ్యామిలీ వాళ్ళని కలిశారు. నిజానికి మోహన్ బాబు గారే సూర్య ని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసారు అంటా. రైటర్స్ బి.వి.ఎస్. రవి, గోపి మోహన్ వాళ్ళు సూర్య కి ఒక కథ చెప్పారు. ఆ కథ సూర్య కి నచ్చింది కానీ డేట్స్ కుదరక టైం పడుతుంది అని చెప్పారు సూర్య.

అలా మంచు ఫ్యామిలీ నిర్మాణంలో సూర్య నటించటానికి సర్వం సిద్ధం కానీ కొంచెం టైం పట్టేలా ఉంది. అయితే మోహన్ బాబు సూర్య కి కథ చెప్పడానికి కారణం… సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో ‘మోహన్ బాబు‘ కీలక పాత్ర పోషిస్తున్నారంటా. అలా మంచు ఫ్యామిలీ నుండి హీరో సూర్య స్ట్రెయిట్ గా తెలుగులో ఒక సినిమా చెయ్యబోతున్నాడంటేనే తెలుగులో ఉన్న సూర్య ఫాన్స్ కి ఇది తీపి కబురు. ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది అంటా.

 

View this post on Instagram

 

Man! My brother Suriya! What a transformation! Such an inspiration. God Speed my brother!

A post shared by Vishnu Manchu (@vishnumanchu) on