సూర్య NGK ట్రైలర్ రివ్యూ


NGK Movie Poster
NGK Movie Poster

సూర్య హీరోగా నటించిన NGK చిత్ర ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటించింది . కాగా ఈ చిత్రాన్ని మే 31 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . NGK ట్రైలర్ మాస్ ప్రేక్షకులను అలరించేలా రూపొందింది.

సూర్య మార్క్ వీరావేశ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో మాస్ ని విశేషంగా అలరించేలా రూపొందించారు . అయితే ట్రైలర్ లో కొత్తదనం లేకపోవడంతో కొత్తదనం కోరుకునే వాళ్లని నిరాశ పర్చడం ఖాయం . NGK రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా, చాలా రోజులుగా సూర్య కు సాలిడ్ హిట్ లేకుండా పోయింది దాంతో ఈ NGK పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా సూర్య సొంత సినిమా కావడం విశేషం . తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల కానుంది ఈ చిత్రం .