హీరో సూర్య సినిమాకి లీకుల బెడ‌ద‌!

హీరో సూర్య సినిమాకి లీకుల బెడ‌ద‌!
హీరో సూర్య సినిమాకి లీకుల బెడ‌ద‌!

సూర్య న‌టించిన `సూర‌రైపోట్రు` ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఈ మూవీ త‌రువాత సూర్య బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అందులో ఒక‌టి స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్న మూవీ ఒక‌టి. ఇందులో సూర్య‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. స‌త్య‌రాజ్ ఇందులోని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీతో పాటు దర్శకుడు టిజె జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. సూర్య‌తో పాటు కొంత మంది పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు శుక్ర‌వారం లీక‌య్యాయి.

లీకైన ఫొటోల్లో హీరో సూర్య లాయ‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. ఆయ‌న ప‌క్క‌న వున్న వారంత కూడా అదే దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. అంటే ఇందులో సూర్య లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఈ చిత్రంలో సూర్యతో పాటు `కర్ణన్` ఫేమ్ రాజిషా విజయన్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సూర్య మణిరత్నం నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న తొలి వెబ్ డ్రామా `నవరస`లో గౌతమ్ మీనన్ తెర‌కెక్కిస్తున్న‌ ఎపిసోడ్లో న‌టించిన విష‌యం తెలిసిందే.