బోయపాటి దర్శకత్వంలో సూర్య టాలీవుడ్ ఎంట్రీ?

బోయపాటి దర్శకత్వంలో సూర్య టాలీవుడ్ ఎంట్రీ?
బోయపాటి దర్శకత్వంలో సూర్య టాలీవుడ్ ఎంట్రీ?

మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తయ్యాక బోయపాటి సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ సమయంలో బన్నీ కోసం ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నాడు బోయపాటి. సరైనోడు కాంబినేషన్ కావడంతో కచ్చితంగా భారీ బజ్ ఉంటుంది.

అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ బిజీ. పుష్ప రెండు భాగాలను పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు బోయపాటి మరో కథను రాసుకున్నట్లు వినికిడి. తమిళ హీరో సూర్య ఎప్పటినుండో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాడు. సూర్య టాలీవుడ్ ఎంట్రీ బోయపాటి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది.

అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. తమిళ అగ్ర హీరో విజయ్ టాలీవుడ్ ఎంట్రీను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు సూర్య చిత్రం కూడా. అయితే సూర్య – బోయపాటి శ్రీను – దిల్ రాజు ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.