సూర్యకాంతం రివ్యూ


suryakantham movie review

సూర్యకాంతం రివ్యూ :
నటీనటులు: నిహారిక , రాహుల్ విజయ్
సంగీతం : మార్క్ కె రాబిన్
నిర్మాత : సందీప్
దర్శకత్వం: ప్రణీత్
రేటింగ్ : 2.5 / 5
రిలీజ్ డేట్ : 29 మార్చి 2019

మెగా డాటర్ నిహారిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సూర్యకాంతం. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూర్యకాంతం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు హిట్ లేని నిహారిక ఈ సూర్యకాంతం తోనైనా హిట్ కొడుతుందా ? లేదా చూడాలి.

కథ :

అభి ( రాహుల్ విజయ్ ) పూజ (  పెర్లైన్ ) లకు పెళ్లి చేయాలనుకుంటారు ఇరు కుటుంబాల పెద్దలు. వాళ్ళని పరిచయం చేసుకోమని కలిసేలా చేస్తారు. అయితే పూజ ని పెళ్లి చేసుకోవడానికి సంశయిస్తాడు అభి. అందుకు కారణం సూర్యకాంతం ( నిహారిక) ని ప్రేమించడమే కారణమని చెబుతాడు అభి. స్వతంత్య భావాలున్న సూర్యకాంతం పెళ్లి పట్ల ఎప్పటికప్పుడు అయిష్టత వ్యక్తం చేస్తుంది. అయితే అభిని పూజ ప్రేమిస్తుండగా అభి మాత్రం సూర్యకాంతం ని ప్రేమిస్తాడు.  సూర్యకాంతం అభి ప్రేమని  ఒప్పుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

నిహారిక
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

సాగతీత సన్నివేశాలు
ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

సూర్యకాంతం పాత్రలో నిహారిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ లో విభిన్న పార్శ్వాలను స్పృశించి తన పాత్రకు న్యాయం చేసింది. అభి పాత్రలో రాహుల్ విజయ్ రాణించాడు. పేర్లేన్ కూడా మంచి పాత్ర లభించింది. ఇక మిగిలిన పాత్రల్లో సత్య , శివాజీరాజా , సుహాసిని, తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఇక దర్శకుడు ప్రణీత్ విషయానికి  వస్తే….. ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని బాగానే హ్యాండిల్ చేసాడు కానీ ట్రీట్ మెంట్ లో కాస్త బెటర్ మెంట్ చేసి ఉంటే బాగుండేది. వినోద ప్రధానంగా తెరకెక్కినప్పటికి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచడంలో మాత్రం  తడబడ్డాడు .

ఓవరాల్ గా :

కేవలం యువతకు అందునా మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రమే

English Title : suryakantham movie review

                             Click here for English Review