సూర్య సినిమాకు లైన్ క్లియ‌ర్ కానీ…!


సూర్య సినిమాకు లైన్ క్లియ‌ర్ కానీ...!
సూర్య సినిమాకు లైన్ క్లియ‌ర్ కానీ…!

త‌మిళ స్టార్ హీరో సూర్య హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`. సుధా కొండ‌గ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించింది. క‌లెక్ష‌ర్‌కింగ్ మోహ‌న్‌బాబు, బాలీవుడ్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య నిర్మించారు.

ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కులు జి.ఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఏయిర్ ఇండియా నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు. లాక్‌డౌన్ కార‌ణంగా సినిమాల‌న్నీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో సూర్య కూడా త‌న చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ఈ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందు కోసం ఆమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా. ఈ నెల 30ర ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నామంటూ హీరో సూర్య ప్ర‌క‌టించారు.

అయితే ఏయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో రూపొందించిన చిత్రం కాబ‌ట్టి దీనికి సంబంధించిన సంస్థ‌లు ఎన్ ఓసీ ఇవ్వ‌డంలో జాప్యం జ‌రిగింది. దీంతో ఈ మూవీ అనుకున్నట్టుగా ఈ నెల 30న రిలీజ్ క‌ష్టంగా మారింది. తాజాగా స‌ద‌రు సంస్థ‌లు సూర్య చిత్రానికి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ ని జారీ చేయ‌డంతో రిలీజ్ సుగ‌మం అయ్యింది. అయితే ముందు అనుకున్న స‌మ‌యానికి కాకుండా ఈ చిత్రాన్ని దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్న‌ట్టు 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌తినిధి రాజ‌శేఖ‌ర్ పాండ్య‌న్ వెల్ల‌డించిన‌ట్టు కోలీవుడ్ స‌మాచారం.