సూర్యుడివో.. చంద్రుడివో సాంగ్ రిలీజ్ – రిపోర్ట్


Suryudivo Chandrudivo Lyrical Video Song from Sarileru Neekevvaru
Suryudivo Chandrudivo Lyrical Video Song from Sarileru Neekevvaru

గతంలో మన సిటీలలో ఉండే బాయిలర్ కోళ్ళు ఫ్రైడే నుండి సండే నైట్ వరకూ పీతల్లాగా ఎంజాయ్ చేసి, మండే వచ్చిందంటే మొహం మ… మ…. అదే మట్టిగడ్డల్లాగా పెట్టుకుని ఆఫీసులకు, కాలేజ్ లకు బయలుదేరుతారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీ “సరిలేరు నీకెవ్వరు” నుండి మాస్ మండే అప్ డేట్స్ రావడంతో, బాబు ఫాన్స్ మాత్రం మండే కోసం ఆశగా వెయిట్ చేస్తున్నారు.

లాస్ట్ మండే, మైండ్ బ్లాకు అనే కాపీ క్యాట్ ట్యూన్ ఇచ్చి బాబు ఫాన్స్ తో బండ బూతులు తిట్టించుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈసారి “సూర్యుడివో, చంద్రుడివో” అంటూ సాగే బాబు భజన పాటను రిలీజ్ చేసాడు. ఇక ఈ పాటను మా గురువు గారు రామజోగయ్య శాస్త్రి గారు రాసారు. ఆయన గురించి మనకు తెలిసిందే కదా! ఏదీ ఒక పట్టాన ఒప్పుకోడు. సరే మరి ఆ మనిషి డెడికేషన్ అలాంటిది. సాంగ్ ట్యూన్ ఎందులో నుంచి ఎత్తాడో తర్వాత సంగతి. ముందు శాస్త్రి గారు అయితే సారధి, వారధి, ప్రేమ పండించే రుషి, కృషి, మహా మనిషి అనీ అద్భుతమైన పదాలు రాసారు.

సాంగ్ మొదట చరణం బాబు గారి భజన గురించి ఉంటే, రెండో చరణంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాత్రను, మరియు భూదేవి గొప్పతనాన్ని మ్యాచ్ చేస్తూ మా శాస్త్రి గారు రాసిన వాక్యాలు అయితే అమోఘం.

ఒక్కపాటలో ఆ పాటలో ఉన్న స్త్రీ క్యారెక్టర్, ప్రకృతి గొప్పదనం, భూమాత ఓర్పు ఇలా అర్ధం చేసుకున్న వాళ్ళకి అర్ధం అయినంత. ఈ పాటను పంజాబీ సింగర్ B. పరాక్ ఆలపించారు. ఆయన గొంతు ఈ పాటకు బాగా సెట్ కుదిరింది, కానీ హీరోల ఇమేజ్ పేరుతో ఎక్కడినుండో, ఎవరినో తెచ్చి కోట్లు తగలెయ్యడం మనోళ్ళకు బాగా అలవాటు అయ్యింది.

1989 లో కొడుకు దిద్దిన కాపురంలో కాపురంలో నటించిన మహేష్ – విజయశాంతి మళ్ళీ 2019లో సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆరాధ్య నటుడు రాజేంద్ర ప్రసాద్ భార్య పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. కథాపరంగా ఆమె మహేష్ కు అక్క & వదిన లేదా తల్లి పాత్ర అయ్యే అవకాశం ఉంది.

ఇక చివరగా, ఈ పాట వినేముందు ఆ మధ్య కాలంలో తెలుగులో హీరోగా బాగానే మండించిన సిద్దార్థ & మా మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన “కొంచెం ఇష్టం – కొంచెం కష్టం” సినిమాలో “పట్టుకో, పట్టుకో చెయ్యి జారనియ్యక” అనే పాత తాకుండా వినండి. ఏ మాత్రం మ్యాచ్ అయ్యినా, మళ్ళీ దేవి అన్నకు ఇంకో రౌండ్ వేసుకుందాం.