ఓటీటీలో సుశాంత్ చివ‌రి సినిమా!


ఓటీటీలో సుశాంత్ చివ‌రి సినిమా!
ఓటీటీలో సుశాంత్ చివ‌రి సినిమా!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హ‌ఠాత్తుగా ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అత‌ని మ‌ర‌ణంతో యావ‌త్ భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ మునిగిపోయింది. సుశాంత్ మర‌ణానికి ప్ర‌ధాన కార‌ణం నెపోటిజ‌మ్ అని బాలీవుడ్ ఇండస్ట్రీపై నెటిజ‌న్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. సుశాంత్ పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్ కూడా అత‌న్ని ఎవ‌రు హ‌త్య చేయ‌లేద‌ని, తానే ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని వ‌చ్చినా సుశాంత్ మ‌ర‌ణంపై ఇంకా నీలి నీడ‌లు క‌మ్ముకునే వున్నాయి.

ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చివ‌రి చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‌‌`దిల్ బెచారా` పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ముఖేష్ చాబ్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జూలై 24న  డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

జాన్ గ్రీన్ ఫేమ‌స్ న‌వ‌ల `ది ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్` ఆధారంగా `దిల్ బెచారా` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా సంజ‌న సంఘీ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. సుశాంత్ అభిమానుల‌కు ఈ సినిమా గిఫ్ట్‌గా అందిస్తున్నామ‌ని డిస్నీ హాట్ స్టార్ సంస్థ వెల్ల‌డించింది.