సుశాంత్ ని రియా ఇష్టారితిగా వాడుకుందా?


sushant singh rajput spend more money for rhea chakraborty
sushant singh rajput spend more money for rhea chakraborty

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అత‌ని మ‌ర‌ణానికి కార‌ణం రియా అంటూ మీడియా వ‌ర్గాలు, నెటిజ‌న్స్‌, సుశాంత్ అభిమానులు ముక్త కంఠంతో వాదిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ కేసులో త‌వ్వినా కొద్ది కొత్త విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. వివిధ మీడియా ఛాన‌ల్స్‌లో ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన రియా త‌ను సుశాంత్ నుంచి ఎలాంటి ల‌బ్ది పొంద‌లేద‌ని, కేవ‌లం అత‌డు తాగిన బాటిల్‌ని మాత్ర‌మే త‌న వ‌ద్ద వుంచుకున్నాన‌ని రియా వెల్ల‌డించింది.

అయితే అది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, తన అవ‌స‌రాల కోసం సుశాంత్‌ని భీభ‌త్సంగానే వాడేసింద‌ని తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు క‌నోడియా సుశాంత్ బ్యాంక్‌ అకౌంట్‌ల‌లో ఒక అకౌంట్‌ని ప‌రిశీలించారు. ఈ అకౌంట్ ద్వారా అత్య‌ధిక శాతం డ‌బ్బులు ఖ‌ర్చు చేసిన‌ట్టు నిర్ధారించారు చారిటీల‌కు, వ్య‌క్తిగ‌త వీసాల‌కు, ప్ర‌యాణాల‌కు, ఆధ్యాత్మిక కార్య‌క‌లాపాల కోసం ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది.

అయితే ఇందులో అధిక మొత్తం డ‌బ్బుని మాత్రం రియా సోద‌రుడి వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల కోస‌మే వాడిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది.  సుశాంత్ అకౌంట్‌ని ప‌రిశీలిస్తే రియాతో పాటు ఆమె సోద‌రుడికే సుశాంత్ అత్య‌ధికంగా డ‌బ్బులు ఖ‌ర్చు చేసిన‌ట్టు గా క‌నోడియా వెల్ల‌డించారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు అంటే దాదాపు ప‌ది నెల‌ల్లో  ఈ ఇద్ద‌రు దాదాపు ఐదు కోట్లు ఖ‌ర్చు చేయించార‌ని బ‌య‌ట‌ప‌డింది. ఇందులో రియా, ఆమె సోద‌రుడి వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల‌కే 4.72 ల‌క్ష‌లు, రియా వ్య‌క్త‌గ‌త అవ‌స‌రాల‌కు 3.4 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు బ‌య‌ట‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.