సుశాంత్ ప్రణాళికలు ఏంటో తెలుసా?


సుశాంత్ ప్రణాళికలు ఏంటో తెలుసా?
సుశాంత్ ప్రణాళికలు ఏంటో తెలుసా?

సుశాంత్ సింగ్ ఆత్మహత్య రోజుకో మలుపుతిరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెపోటిజమ్ కారణంగా సుశాంత్ మరణించాడని ఫాన్స్ , బాలీవుడ్ సెలెబ్రిటీ లు ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఫ్యామిలీ మాత్రం సుశాంత్ మృతికి రియా నే కారణమని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో రియా పై సుశాంత్ తండ్రి కె కె సింగ్ కేసు ఫైల్ చేయడం తెలిసిందే.

ఇదిలా ఉంటే సుశాంత్ సోదరి గత కొన్నిరోజులుగా సుశాంత్ కి సంబందించిన విషయాలని పోస్ట్ చేస్తోంది. సుశాంత్ చనిపోవడానికి ముందు జూన్ 29 నుంచి తను చేయాలనుకుంటున్న విజన్ బోర్డు ని సుశాంత్ సోదరి షేర్ చేసింది. సుశాంత్ వైట్ బోర్డు పై మార్క్ చేసిన లిస్ట్ ఆకట్టుకుంటోంది.
‘ఉదయాన్నే నిద్రలేవాలి .. బుక్స్ చదవాలి , గిటార్ నేర్చుకోవాలి. మంచి కంటెంట్ వున్న సినిమాలు, స్టోరీ లు చూడాలి. జూన్ 29 నుంచి వర్కవుట్లు చేయాలి .  ట్రాన్స్ డెంటల్ మెడిటేషన్ ఫాలో అవ్వాలి. చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’ అంటూ పక్కా గా ప్లాన్ చేసుకున్నాడు సుశాంత్. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి షేర్ చేసిన వైట్ బోర్డు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.