అల వైకుంఠపురములో చేసినందుకు రిగ్రెట్స్ ఏం లేవటఅల వైకుంఠపురములో చేసినందుకు రిగ్రెట్స్ ఏం లేవట
అల వైకుంఠపురములో చేసినందుకు రిగ్రెట్స్ ఏం లేవట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురములో ఈ సంక్రాంతికి విడుదలై ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి 2 తప్పించి టాలీవుడ్ లో నమోదైన రికార్డులు అన్నిటినీ క్రాస్ చేసింది ఈ చిత్రం. నిర్మాతలకు, బయ్యర్లకు ఈ సినిమా బోలెడన్ని లాభాల్నితీసుకొచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ ఈ సినిమాపై విశేషంగా పనిచేసింది. అయితే ఈ సినిమా గురించి మెయిన్ గా ఒక నెగటివ్ పాయింట్ గురించి విశ్లేషకులు ప్రస్తావిస్తారు. అదే తెర నిండా బోలెడంత మంది పేరున్న నటీనటులు ఉంటారు కానీ వారిలో చాలా మందికి సరైన పాత్రలు రాలేదు. ముఖ్యంగా సుశాంత్, సునీల్, నివేతా పేతురాజ్ వంటి వారికి దక్కిన పాత్రలు అంతగా ప్రాధాన్యం లేనివే.

ముఖ్యంగా ఒక హీరో అయ్యుండి సుశాంత్ ఇందులో క్యారెక్టర్ ప్లే చేస్తే బొత్తిగా తనకు చిన్న పాత్ర ఇచ్చారని విమర్శలు వచ్చాయి. రేంజ్ వేరైనా సుశాంత్ కూడా హీరోగా సినిమాల్లో బిజీగా ఉంటున్న నటుడే. మరి సుశాంత్ ను ఏరి కోరి తీసుకుని ఎందుకిలా చేసారోనని చాలా మంది చర్చించుకున్నారు. ఈ విషయం సుశాంత్ వరకూ కూడా వచ్చింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాడు సుశాంత్. అందులో ఒక నెటిజన్.. అల వైకుంఠపురములో చేసినందుకు రిగ్రెట్ ఫీలవుతున్నారా? అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా చేసారు అని సూటిగా ప్రశ్నించాడు.

దానికి సుశాంత్ ఏ మాత్రం సంశయించకుండా, అల వైకుంఠపురములో చిత్రం చేయడం వెనకాల చాలానే కారణాలు ఉన్నాయి. అయితే ఆ రోల్ చేసినందుకు నాకేమీ రిగ్రెట్స్ లేవు. భారీ తారాగణం మధ్య సినిమా చేస్తున్నప్పుడు మనం టీమ్ ప్లేయర్ గానే ఉండాలి. ఈ సినిమాలో నేను నటించిన సీన్స్ యూట్యూబ్ లో త్వరలో వస్తాయని ఆశిస్తున్నా. అల వైకుంఠపురములో చేసినందుకు నేను చాలా సంతోషంగానే ఉన్నా అని బదులిచ్చాడు.

మరి కత్తిరించిన సీన్స్ చూస్తే సుశాంత్ ఈ సినిమాకు ఎంత కీలకమో తెలుస్తుందేమో.