“అల…వైకుంఠపురం లో” జంట మరో సినిమా


“అల...వైకుంఠపురం లో” జంట మరో సినిమా
“అల…వైకుంఠపురం లో” జంట మరో సినిమా

“అల.. వైకుంఠపురంలో”  సినిమాలో జంట అంటే కేవలం అల్లు అర్జున్ & పూజ హేగ్దే మాత్రమె కాదు, అక్కినేని సుశాంత్ – నివేదా పేతురాజ్ కూడా ఉన్నారు. అసలు అంత పెద్ద సినిమాలో హీరో& హీరోయిన్స్ తోపాటు మరొక జంట మధ్య కూడా ఒకటి,రెండు లవ్ సీన్స్ ప్లాన్ చేసి, రిజిస్టర్ చెయ్యడం అంత ఈజీ కాదు. అసలు అక్కడ స్పేస్ లేదు.. కానీ గురూజీ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.

ఒక క్రియేటర్ ఏదీ చేసినా ఆశి అక్కడితో ఆగిపోదు. ఇప్పుడు అక్కినేని సుశాంత్ & నివేదా పేతురాజ్ జంటగా మరొక సినిమా ఫైనల్ అయినట్లు సమాచారం. అల.. సినిమాలో లాగే ఇందులో కూడా సుశాంత్ – నివేదా కొత్త సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడి పేరుతో పాటు ఇప్పటికే సుశాంత్ తో సినిమా చేసిన మరొక దర్శకుడి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కరెక్ట్ కథ, క్యారెక్టర్, డైరెక్టర్ సెట్ అయితే సుశాంత్ నుండి ఛి.ల.సౌ లాంటి సూపర్ హిట్ సినిమా రావడం గ్యారంటీ.

ప్రస్తుతం సుశాంత్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమా చేస్తున్నాడు.లేట్ సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రేమ కథలకు అక్కినేని ఫ్యామిలీ పెట్టింది పేరు. ఇక ఈ కొత్త ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సుశాంత్ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.