రండి… మాట్లాడుకుందాం…! అంటున్న సుశాంత్


రండి... మాట్లాడుకుందాం...! అంటున్న సుశాంత్
రండి… మాట్లాడుకుందాం…! అంటున్న సుశాంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో సుశాంత్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లైవ్ లో అభిమానులతో మాట్లాడతానని ప్రకటించారు. ప్రజలు అభిమానులు తనను ఏదైనా అడగవచ్చనీ, కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం అడగాలని అక్కినేని సుశాంత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మీదట  అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాననీ, “ఫ్యాన్స్ తో మాట్లాడి చాలా రోజులు అయింది. ఈ ఆదివారం మీ కుటుంబ సభ్యులందరితో ఆనందంగా ఇంటివద్ద గడపండి.” అని సుశాంత్ అభిమానులకు సూచిస్తున్నారు.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ సాధించిన “అల వైకుంఠ పురంలో” సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించిన సుశాంత్ ప్రస్తుతం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే మరొక కొత్త సినిమాలో నటిస్తున్నారు. “అలా వైకుంఠపురంలో…” సినిమాలో ఆయన పాత్ర కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఆయన గత చిత్రం “చి.ల.సౌ” కూడా ఘన విజయం సాధించి మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. తనకు ఎలాంటి కథలు సెట్ అవుతాయో తెలుసుకున్నసుశాంత్ ఇక మీదట తన వయసుకు తగ్గట్లు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చేస్తూ.. అదే సమయంలో కొంచెం డిఫరెంట్ కథలు కూడా ఎంచుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.