`ఓయ్‌` ద‌ర్శ‌కుడికి మెగా ఆఫ‌ర్‌!


`ఓయ్‌` ద‌ర్శ‌కుడికి మెగా ఆఫ‌ర్‌!
`ఓయ్‌` ద‌ర్శ‌కుడికి మెగా ఆఫ‌ర్‌!

మెగా కుటుంబం నుంచి మ‌రో నిర్మాత ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల త‌న‌య సుస్మిత త‌న భ‌ర్త విష్ణుతో క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. `గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌` పేరుని ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించిన సుస్మిత తొలి ప్ర‌య‌త్నంగా ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

దీనికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు ఇటీవ‌లే జ‌రిగాయి. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు రీఓపెన్ అయ్యే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వెబ్ సిరీస్‌ల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో చాలా మంది వెబ్ సిరీస్‌ల నిర్మాణం ప్రారంభిస్తున్నారు. ఈ కోవ‌లోనే మెగా డాట‌ర్ సుస్మిత కూడా వెబ్ సిరీస్‌తో కొత్త అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టింది.

సుస్మిత నిర్మించనున్న వెబ్ సిరీస్‌కు `ఓయ్‌` ఫేమ్ ఆనంద్ రంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. `ఓయ్‌` త‌రువాత ఆనంద్ రంగ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఒక్క ఆఫ‌ర్ కూడా ద‌క్క‌లేదు. అలాంటి ఆనంద్ రంగ‌కు సుస్మిత వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ వెబ్ సిరీస్‌కు `ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఫైర్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. ప్ర‌కాష్‌రాజ్ లీడ్ రోల్‌లో న‌టించ‌నున్న ఈ వెబ్ సిరీస్‌లోని మ‌రో కీల‌క పాత్ర‌లో సంప‌త్‌రాజ్ క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.