చిరు జుట్టుతో ప్ర‌యోగాలు చేసిన సుష్మిత‌!

చిరు జుట్టుతో ప్ర‌యోగాలు చేసిన సుష్మిత‌!
చిరు జుట్టుతో ప్ర‌యోగాలు చేసిన సుష్మిత‌!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత చిరుకు ప‌ర్స‌న‌ల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిపోయిన విష‌యం తెలిసిందే ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి, తాజాగా `ఆచార్య‌` చిత్రాల‌కు గానూ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వుంటున్న సుష్మిత క‌రోనా కార‌ణంగా హెయిర్ క‌ట్ ఇబ్బందిగా మార‌డంతో ఆ ప‌నిని కూడా తానే చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఫాద‌ర్స్‌డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సుష్మిత ఫాద‌ర్ మెగాస్టార్ చిరంజీవికి హెయిర్ క‌ట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ సైంద‌ర్భంగా సుష్మిత సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. తండ్రి చిరుకు ఫాద‌ర్స్‌డే శుభాకాంక్ష‌లు అంద‌జేసిన సుష్మిత ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా హెయిర్ క‌ట్ చేసి ఏకంగా తండ్రి హెయిర్‌తో ప్ర‌యోగాలు చేసింది.

చిరంజీవి హెయిర్ క‌ట్ చేసిన వీడియోని నెటిజ‌న్స్‌తో పంచుకున్న సుష్మిత  త‌న తండ్రిపై వున్న ప్రేమ‌ని, త‌న‌పై తండ్రి చిరుకు వున్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేసింది.  `నాన్న ప్రేమకు ధన్యవాదాలు. జుట్టు క‌త్తిరించ‌డం నుంచి ప్ర‌తీ విష‌యంలోనూ మీరు నన్ను న‌మ్మారు. అ న‌మ్మ‌క‌మే న‌న్ను ఈ రోజు ఇలా నిల‌బెట్టింది. ల‌వ్ యూ డాడ్ హ్యాపీ ఫాద‌ర్స్ డే` అని సుష్మిత ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది.