హార్ట్ బీట్ పెంచేస్తున్న ల‌వ్‌బ‌ర్డ్స్‌!


హార్ట్ బీట్ పెంచేస్తున్న ల‌వ్‌బ‌ర్డ్స్‌!
హార్ట్ బీట్ పెంచేస్తున్న ల‌వ్‌బ‌ర్డ్స్‌!

బాలీవుడ్ ముదురు హీరోయిన్ సుస్మితాసేన్ . గ‌త కొంత కాలంగా 27 ఏళ్ల మోడ‌ల్ రోమాన్ షా‌ల్ తో స‌హ‌జీవనం చేస్తున్న విష‌యం తెలిసిందే. 44 ఏళ్ల సుస్మిత 27 ఏళ్ల వ్య‌క్తితో ప్రేమాయ‌ణం సాగించ‌డం ఏంట‌ని బాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నం ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసినా సున్మిత మాత్రం అత‌న్ని ఏకంగా త‌న ఇంటికే తీసుకెళ్లి త‌న పిల్ల‌ల‌తో స‌హా క‌లిసి వుంటోంది.

ఇదిలా వుంటే క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంటి ప‌ట్టునే వుంటున్న సుస్మిత‌సేన్ రోజుకో వీడియోతో నెటిజ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మొద‌లుపెట్టారీ ల‌వ్‌బ‌ర్డ్స్‌. ఫిట్ నెస్ పేరుతో డైలీ విచిత్ర‌మైన ఫీట్లు చేస్తున్న సుస్మితాసేన్ జోడీ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో సుస్మితాసేన్‌ని త‌న క‌ళ్ల‌పై బ్యాలెన్స్ చేస్తూ రోమాన్ షా‌ల్ గాల్లో నిల‌బెట్టిన తీరు నెటిజ‌న్స్ హార్ట్ బీట్‌ని పెంచేస్తోంది. ముదురు వ‌య‌సులో ఈ భామ చేస్తున్న సర్క‌స్ ఫీట్‌ల‌కు అంతా ఫిదా అయిపోతున్నారు.  `నా బ‌ల‌మైన వ్య‌క్తి రోమ‌న్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్థిర‌మైన బంధానికి స్థిరంగా వుండ‌టం చాలా ముఖ‌్యం. సౌక‌ర్య‌వంత‌మైన మ‌న‌స్సు, ప‌ర‌స్ప‌ర బ‌లం, ఒక‌రిపై ఒక‌రికి అపార‌మైన న‌మ్మ‌కం అవ‌స‌రం ఈ భంగిమ ఆ బంధానికి ప్ర‌తీక‌` అని సుస్మితాసేన్ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇవ్వ‌డం విశేషం.

Credit: Instagram