పిక్ టాక్ : ముదురు ప్రేయ‌సితో హాట్ యోగా..!


పిక్ టాక్ : ముదురు ప్రేయ‌సితో హాట్ యోగా..!
పిక్ టాక్ : ముదురు ప్రేయ‌సితో హాట్ యోగా..!

ప్ర‌పంచం, దేశం క‌రోనా వైర‌స్ కార‌ణంగా భ‌యంతో వ‌ణికిపోతుంటే సెల‌బ్రిటీలు మాత్రం చాలా బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఎవ‌రికి న‌చ్చిన ప‌నిలో వారు నిమ‌గ్న‌మైపోయి మాలా చేయ‌డానికి ప్ర‌య‌త్నంచండి.. లేదా మీకు న‌చ్చిన ప‌ని చేస్తూ ఈ క్లిష్ట‌మైన స‌మాన్ని మీకు న‌చ్చిన వాళ్లతో గ‌డ‌ప‌డానికి ప్ర‌య‌త్నించండి అంటూ సోష‌ల్ మీడియాల్లో ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

అదే పనిగా కొంత మంది పేయింటింగ్స్ వేస్తున్నారు. కొంత మంది స్విమ్మింగ్ చేస్తూ అందాలొలికిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి కొంత మందేమో యెగా పేరుతో హాట్ యోగా చేస్తూ నెటిజ‌న్స్‌కి క‌నువిందు చేస్తున్నారు. బాలీవుడ్ ముదురు జంట సుస్మితా సేన్‌, రోమ‌న్ షావ‌ల్ ఈ క్వారెంటైన్ టైమ్‌ని హాట్ యోగా పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ముదురు, లేత జంట‌ క‌లిసి ఒకే ఇంట్లో వుంటున్న విష‌యం తెలిసిందే.

త‌న బాయ్ ఫ్రెండ్‌తో హాట్ యోగా చేస్తున్న సుస్మితాసేన్ త‌న హాట్ యోగా ఫొటోల‌ని షేర్ చేస్తో ఓ పోస్ట్‌ని పెట్టింది. `ఇలాంటి క‌ష్ట కాలం ఎన్ని రోజులు వుండ‌దు. ఈ స‌మ‌యంలో బ‌లంగా వున్న‌వారే ఈ విప‌త్తు నుంచి ఎదుర్కోగ‌ల‌రు. ఈ స‌మ‌యంలో అంతా మాన‌సికంగా, శారీర‌కంగా అన్నింటినీ ఎదుర్కోవ‌డానికి స్ట్రాంగ్‌గా వుండాలి` అని స్టేట్‌మంట్ ఇచ్చింది. సుస్మిత స్టేట్‌మెంట్ ఏమోగానీ తన ప్రియుడితో చేసిన హాట్ యోగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Instagram