ప్రభాస్ సాహో హిట్ పై అనుమానాలు


ప్రభాస్ సాహో హిట్ పై అనుమానాలు
Prabhas Saaho Movie Poster

ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి . దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించింది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే దానికి ముందుగా రెండు పాటలను వదిలారు కానీ ఈ రెండు పాటల వల్ల సాహో చిత్ర విజయం పై అనుమానాలు మొదలయ్యాయి .

పాటలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఇక ఇది కాకుండా మరో బలమైన సెంటిమెంట్ కూడా ఉంది . రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు భారీ విజయాలు అందుకుంటారు కానీ దాని తర్వాత మాత్రం ఘోర పరాజయాలు చవి చూస్తుంటారు . అందుకు బోలెడు ఉదాహరణలు . అంతెందుకు ప్రభాస్ కూడా ఆ కష్టాలు పడ్డాడు ఛత్రపతి తర్వాత . ఇక ఇప్పుడేమో బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం కావడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి . ఆ సెంటిమెంట్ ని ప్రభాస్ సాహో రూపంలో బ్రేక్ చేస్తే మంచిదే ! సాహో పరిస్థితి ఏంటి అన్నది ఆగస్టు 30 న తేలనుంది .