బ‌య‌ట‌ప‌డుతున్న రాగిణి, సంజ‌న‌ల కొత్త క‌థ‌?


బ‌య‌ట‌ప‌డుతున్న రాగిణి, సంజ‌న‌ల కొత్త క‌థ‌?
బ‌య‌ట‌ప‌డుతున్న రాగిణి, సంజ‌న‌ల కొత్త క‌థ‌?

సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత రియా కార‌ణంగా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ కేసులో ముందు రియా ఆమె సోద‌రుడు షోవిక్ చక్ర‌వ‌ర్తి అరెస్ట్ అయ్యారు. అనంత‌రం ఎన్సీబీ విచార‌ణ‌లో స్టార్ హీరోయిన్‌లు దీపిక ప‌దుకునే, సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధా కపూర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు బ‌య‌టికి రావ‌డం, ఎన్సీబీ వారికి స‌మ‌న్లు జారీ చేయ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల ఎన్సీబీ ముందు దీపిక ప‌దుకునే, సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధా కపూర్‌, ర‌కుల్ ప్రీత్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇదిలా వుంటే సాండ‌ల్‌వుడ్‌లోనూ డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ కేసులో ప్ర‌ధానంగా హీరోయిన్‌లు రాగిణి దివ్వేది, సంజ‌న గ‌ల్రానీల పేర్లు బ‌య‌టికి రావ‌డంతో వారి ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన ఎన్సీబీ అధికారులు ఇటీవ‌ల వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

తాజాగా వీరి గురించి షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. రాగిణి దివ్వేది, సంజ‌న గ‌ల్రానీ డ్ర‌గ్స్‌తో పాటు సెక్స్ రాకెట్‌ని కూడా న‌డిపిన‌ట్టు కీల‌క ఆధారాలు ఎన్సీబీ అధికారులు ల‌భించిన‌ట్టు జాతీయ మీడియా క‌థ‌నం. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేశార‌ని, దాని ఆధారంగానే సెక్స్ రాకెట్‌ని న‌డిపించి కోట్ల‌ల్లో ఆస్తుల్ని కూడ‌బెట్టారని సాండ‌ల్ వుడ్ మీడియాలో వినిపిస్తోంది.