బూతు చిత్రాల గోల ఎక్కువయ్యింది


బూతు చిత్రాలు
బూతు చిత్రాలు

అడల్ట్ చిత్రాలు ఇంతకుముందు హాలీవుడ్ , బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది కానీ డిజిటల్ పుణ్యమా అని టాలీవుడ్ లో ఈ గోల ఎక్కువయ్యింది ఇప్పుడు . పేరుకి యూత్ కి నచ్చే చిత్రం అంటూ ఎవరు పడితే వాళ్ళు సినిమా తీసేస్తున్నారు . సినిమా తీయడానికి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు కానీ కథ , కథనం , దానికి తగ్గ నటీనటులను , సాంకేతిక నిపుణులను ఎంచుకొని సినిమా చేయాలి కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటయ్యా అంటే యూత్ పేరుతో బూతు చిత్రాల హడావుడి ఎక్కువైంది .

గతకొంత కాలంగా ఈ బూతు చిత్రాల గోల ఎక్కువయ్యింది . యు ట్యూబ్ లో టాలీవుడ్ కొత్త చిత్రాల పేర్లని చూస్తే చాలు టీజర్ , ట్రైలర్ లు అన్నీ శృంగారం తో నిండి ఉంటున్నాయి . పోనీ ఇవేమైనా హిట్ అవుతున్నాయా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియడం లేదు . తాజాగా 20 కి పైగా బూతు  సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి . ఏడుచేపల కథ , రొమాంటిక్ క్రిమినల్స్ , సెవెన్ , డిగ్రీ కాలేజ్ , రాయలసీమ లవ్ స్టోరీ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది .