సైరా సెట్ మళ్ళీ వేసారట


sye raa narasimha reddy hero set in kokapetరెవిన్యూ అధికారులు సైరా …… నరసింహారెడ్డి సెట్ ని కూల్చేయడంతో ఎక్కడో వేసి ఇబ్బంది పడేకంటే సొంత స్థలం లోనే వేసుకుంటే బెటర్ అని భావించి కోకాపేట లోని సొంత స్థలం లో మళ్ళీ సైరా సెట్ వేసారట . ఇంతకుముందు బూత్ బంగ్లా లో వేసిన సైరా ….. నరసింహారెడ్డి సెట్ ని రెవిన్యూ డిపార్టుమెంట్ కూల్చేసిన విషయం తెలిసిందే . ఇంతకుముందు అదే స్థలంలో చరణ్ నటించిన రంగస్థలం సెట్ ని వేసారు . దాంతో అదే స్థలంలో సైరా వేయగా రివర్స్ అయ్యింది దాంతో మళ్ళీ సెట్ వేశారు .

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండటం విశేషం . చిరంజీవి తో పాటు అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితర ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రం పై ఒకవైపు వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తీస్తూ మాకు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని , మా మనోభావాలు కించ పర్చారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు మీడియా కెక్కారు . ఆ సమస్య ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ పరిష్కరిస్తానని మాట ఇచ్చాడు మరి ఆ పరిష్కారం ఎంత వరకు వచ్చిందో ! మళ్ళీ సెట్ వేయడంతో మరో షెడ్యూల్ కు రంగం సిద్ధం అవుతోంది .

English Title: sye raa narasimha reddy hero set in kokapet