సైరా నరసింహారెడ్డి విడుదల వాయిదా!! 


సైరా నరసింహారెడ్డి విడుదల వాయిదా!!
సైరా నరసింహారెడ్డి విడుదల వాయిదా!!

స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం  ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ పాత్ర పోషిస్తున్నారు.  కొణెదల ప్రొడక్షన్స్‌పై ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పిస్తుంది.

మెగాస్టార్ సరసన ప్రముఖ హీరోయిన్  నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్ఛా సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా, నిహారిక  కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం  మేకింగ్ వీడియోకి, టీజర్ కు  విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని  తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.  

గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, తాజాగా విడుదల తేదీ విషయంలో నిర్ణయం మార్చుకున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో  చక్కర్లు కొడుతోంది. 

హృతిక్ రోషన్ – టైగర్ ష్రాప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘వార్’ కూడా అక్టోబర్ 2న  రిలీజ్ అవుతోంది. దీని వల్ల సైరా హిందీ వర్షన్‌కు థియేటర్లు దొరకడం లేదట. ఇదే విషయాన్ని ఫర్హాన్ అక్తర్.. రామ్ చరణ్‌కు చెప్పాడట. అంతేకాదు, సినిమాను వారం పాటు వాయిదా వేద్దామని కూడా కోరాడని సమాచారం. ఆయన కోరికను లోకల్ డిస్టిబ్యూటర్లతో చెప్పిన తర్వాత రామ్ చరణ్ సినిమా వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

అక్టోబర్ 2న రిలీజ్ చేయకపోతే.. 8వ తేదీన సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో తేదీ నుంచి ఆదివారం వరకు వరుస సెలవులు ఉండడమే దీనికి కారణం అని అంటున్నారు. అన్ని చోట్లా దసరా సెలవులు ఉంటాయి కాబట్టి సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందని వాళ్లు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది… త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది..!!